FbTelugu

ఐటీఐఆర్ పై బీజేపీ, టీఆర్ఎస్ దొంగాట: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ఏర్పాటు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలది ఇద్దరిది దొంగాటేనని ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏడేళ్లయినా ఐటీఐఆర్, పై టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) ఇవ్వలేదన్నారు.

ఇవ్వాళ ఎంపీ రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం ఐటీఐఆర్ ను కోల్పోయిందన్నారు. టీఆర్ఎస్ అంటే టోటల్ రివర్స్ స్టాండ్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఐటీఐఆర్ కు సమానమైన ప్యాకేజీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని ప్రాధేయపడడం ఇవ్వాలనడం దారుణమన్నారు. మంత్రి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని ఆరోపించారు. దీనిపై కేటీఆర్ దగ్గర అసలు ప్రణాళికనే లేదని.. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసం లెటర్ రాయడం ఏంటి అని నిలదీశారు. కమిషన్ లు వచ్చేదుంటే ఐటీఐఆర్ కు కూడా కేసీఆర్ డిపిఆర్ ఇస్తుండేనన్నారు. కమిషన్ లు వచ్చినందుకే కాళేశ్వరం ప్రాజెక్టును డిపిఆర్ లేకుండానే నిర్మించాడని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పెట్టుబడిదారులను పెంచేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించడంతో దేశంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుందని రేవంత్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.