FbTelugu

పిసిసి అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఏ.రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఐదు కులాల నుంచి ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కి గౌడ్ ఎంపికయ్యారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహ్మద్ అజారుద్దీన్, జె.గీతారెడ్డి, తూర్పు జయప్రకాశ్ రెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు సంభాని చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పోడెం వీరయ్య, సురేష్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, కుమార్ రావు, జావేద్ అమీర్, ఎలక్షన్ మేనేజిమెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, ఏఐసిసి ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ గా అల్లేటి మహేశ్వర్ రెడ్డి ఎంపికైనట్లు ఏఐసిసి జనరల్ సెక్రెటరీ కెసి.వేణుగోపాల్ ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఏడాది కాలంగా పిసిసి అధ్యక్ష పదవిపై ఏఐసిసి ఖరారు చేయకుండా నాన్చుతూ వస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.