FbTelugu

హైవేలపై మంత్రి హరీష్ రావు సమీక్ష

సంగారెడ్డి: జిల్లాలోని హైవేలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఎచ్ 161 పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

జిల్లాలోని 1,447 డబుల్ బెడ్రూం ఇళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా జిల్లాలో నిర్మించ తలపెట్టిన 116 రైతు వేదికలను 3 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ప్రజలు స్వియ నియంత్రణ పాటించాలని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.