FbTelugu

అంతర్వేదిపై బీజేపీ కపట నాటకం: మంత్రి శ్రీనివాస్

తాడేపల్లి: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై గతేడాది సెప్టెంబర్ నెలలో సీబీఐ దర్యాప్తు చేయమని ప్రభుత్వం జీఓ ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం విచారించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాలుగు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ వేయలేదు? అనేది రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని రికార్డులు కూడా సీబీఐకి అప్పజెప్పామన్నారు. కేంద్రంలో ఉన్నది బీజేపీనే కదా అని మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? మంత్రి శ్రీనివాస్ నిలదీశారు.

రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి టీడీపీ హయాములో 2014 -19 మధ్య రూ.150 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక రూ.168 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ నిధులు రూ.70 కోట్లు కనకదుర్గమ్మ దేవాలయానికి కేటాయింపులు జరిగాయన్నారు. గుడికో గోమాత అని చక్కటి కార్యక్రమం చేస్తున్నామన్నారు. సంక్రాతి కనుమ పండుగనాడు సుమారు 2500 దేవాలయాల్లో గోమాతకు పూజ చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.