FbTelugu

లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఉద్యోగి

రంగారెడ్డి: ఒక సర్వే రిపోర్టు ఇవ్వడం కోసం రంగారెడ్డి ల్యాండ్ సర్వే అండ్ సెటిల్ మెంట్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

డిమాండ్ ప్రకారం సదరు దరఖాస్తుదారుడు ఇవాళ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఆఫీసులో రూ.5000 వేలు అప్పగించాడు. లంచం డబ్బులు వెంకటేశ్వర్ రెడ్డి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంటనే ఆఫీసులో సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సూపరింటెండెంట్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

You might also like