FbTelugu

కెసిఆర్ దళిత ద్రోహి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో దళితులకు సిఎం కెసిఆర్ చేస్తున్న ద్రోహం పై పోరాడాలని సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు సూచించారని పిసిసి నూతన అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో అతి పెద్ద దళిత ద్రోహి సిఎం కెసిఆర్ అని ఆయన అభివర్ణించారు.

పంజగుట్ట చౌరస్తాలో బిఆర్.అంబేడ్కర్ విగ్రహం పెడితే, అక్కడే ఉండనీయకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేశారన్నారు. మాజీ సిఎం వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహం కోసం ఈ దారుణానికి ఒడిగట్టారని అన్నారు. నెక్లెస్ రోడ్డు జంక్షన్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి.. తట్టెడు మట్టి తీయలేదన్నారు. దళిత సాధికారికత పేరుతో అసెంబ్లీ నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున సహాయం చేస్తామని అనడం ద్రోహం చేసినట్లేనన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. దళితుల విషయంలో విహెచ్ఆర్ చాలా అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. వి.హనుమంతరావు ఆరోగ్యం బాగోలేదని తెలిసి హాస్పిటల్ లో పరామర్శించేందుకు వచ్చానని రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయన ఆరోగ్యం కుదటపడిందని, హాస్పిటల్ లో ఉన్నా.. ప్రజా సమస్యలపై నాతో చర్చించారన్నారు. పార్టీ అభివృద్ధి విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారన్నారు. మేడమ్ సోనియా గాంధీ వద్దకు స్వయంగా కలిసి వెళ్దామని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం విహెచ్ఆర్ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.