FbTelugu

‘యోగీ తన ప్రమాణస్వీకారాన్ని గుర్తు తెచ్చుకోవాలి’

* యోగీ ఆదిత్యనాథ్ కు విశ్రాంత ఐఏఎస్ లు లేఖ
* మత మార్పిళ్ల ఆర్డినెన్స్ పై ఆగ్రహం
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో బలవంతపు మత మార్పిళ్లపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ 104 మంది విశ్రాంత ఐఏఎస్‌లు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను యోగి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వ తాజా ఆర్డినెన్స్ తో రాష్ట్రం ద్వేష రాజకీయాలకు సెంటర్‌గా మార్చేసిందని పేర్కొన్నారు. సీఎం యోగితో పాటు అన్ని రాజకీయ పక్షాల నేతలు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో చేసిన ప్రమాణ స్వీకారాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని మాజీ ఐఏఎస్‌లు చురకలంటించారు. లేఖ రాసిన వారిలో జాతీయ భద్రతా మాజీ సలహాదారు శివశంకర్ మీనన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి నిరుపమా రావు, ప్రధాని మాజీ సలహాదారు నాయర్ లు ఉండడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.