FbTelugu

టెన్షన్‌ పెట్టిన ఫలితాలు

ఏపీలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి.

కరోనా నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు, ఫలితాల విడుదల ఆలస్యం అవుతున్న తరుణంలో ఏపీ సర్కారు అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఫలితాలను విడుదల చేసి రికార్డు సాధించింది. అయితే, శుక్రవారం ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఇంటర్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు అధ్యాయులు కూడా వాటికోసం ఆత్రుతగా ఎదురుచూశారు.

ఈ సారి పరీక్షలు కొవిడ్‌ వైరస్‌ సోకుతున్న కాలంలో విద్యార్థులు రాశారు. అయితే, ఆ పరీక్షలు జరుగుతున్న కాలంలో కరోనా ప్రభావం ఉన్నా ఏపీలో అప్పటికి అది పెద్దగా కనిపించలేదు. అయితే, కరోనా పెద్దగా ప్రభావితం చేయకపోవడంతో అక్కడ ఇంటర్‌ పరీక్షలు సజావుగా సాగాయి. పరీక్ష రాసే సమయంలో పెద్దగా టెన్షన్‌కు గురికాని విద్యార్థులు ఫలితాల వెల్లడి రోజు మాత్రం బాగా టెన్షన్‌ గురయ్యారు.

ఇంటర్మీడియట్‌ ఫలితాలు అప్‌లోడ్‌ చేసిన సర్వర్‌ కొన్ని గంటలపాటు మొరాయించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్నెట్‌ సెంటర్ల వద్ద ఫలితాల కోసం పడిగాపులు కాశారు. శుక్రవారం సాయంత్రం 4:15 గంటలకు విద్యాశాఖ మంత్రి ఫలితాలు విడుదల చేశారు. దీంతో 4:30 నుంచి ఫలితాలు చూసుకోవచ్చని విద్యార్థులు ఎదురుచూశారు. కానీ రాత్రి 7 తర్వాతగానీ వెబ్‌సైట్లలో ఫలితాలు ఓపెన్‌ కాలేదు. ప్రతిసారీ ఫలితాలు విడుదల చేశాక ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయడంతో పాటు పత్రికలు, ఇతర వెబ్‌సైట్లకు కూడా ఫలితాల సీడీలు ఇచ్చేవారు.

కానీ ఈసారి సీడీల విధానానికి స్వస్తి పలికి క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా ఫలితాలు ఇచ్చారు. మొత్తం 17 వెబ్‌సైట్లకు ఈ ఫలితాలు అప్‌లోడ్‌ చేశారు. కానీ ఒక్క దాంట్లో కూడా ఫలితాలు వెంటనే ఓపెన్‌ కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి కావాల్సి వచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.