FbTelugu

నేడు తేలనున్న నేరేడ్ మెట్ ఫలితం

* ఇవాళే ఓట్ల లెక్కింపు

హైదరాబాద్: నేడు నేరేడ్ మెట్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓటరు స్లిప్పులపై ఇతర గుర్తులున్న 544 ఓట్లను ఇవాళ లెక్కించనున్నారు. అనంతరం ఫలితాన్ని ప్రకటించనున్నారు. ఇప్పటికే నేరేడ్ మెట్ డివిజన్లో 24,632 ఓట్ల లెక్కింపు జరిగినట్టుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు లెక్కించినవాటిలో 504 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఓటరు స్లిప్పులపై స్వస్తిక్ మార్కే కాకుండా.. మరే ఇతర మార్క్ తో టిక్ చేసినా పరిగణలోకి తీసుకోవాలంటూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో.. బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిదే. హైకోర్టు ఆదేశాలతో లెక్కింపును ఆపివేశారు. తాజాగా ఎన్నికలపై పూర్తి నిర్ణయాధికారం ఎన్నికల సంఘానిదే అంటూ తీర్పుఇచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.