FbTelugu

బెజవాడ కనకదుర్గ గుడిలో ఆంక్షలు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కరోనా పాజిటివ్ సోకి కొండపై ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆలయ కమిటీ ఇవాళ్టి నుంచి అమ్మవారి దర్శనం వేళల్లో మార్పు చేసింది.

ఇకనుంచి ఉదయం 6 గంటల నుంచి 11.30 వరకు మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుందని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయ కమిటి ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున ఎన్ఎంఆర్ గా పనిచేస్తున్న ఆకుల హరి మృతి చెందాడు. మంగళవారం (నిన్న) నాడు ఆలయ అర్చకులు రాఘవయ్య మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితమే మరో అర్చకుడు కరోనాతో పోరాడి చనిపోయారు. కొండపై పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు కరోనా పాజిటివ్ తో బాధపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.