FbTelugu

నిమ్మగడ్డకు మళ్లీ ఎస్ఈసీగా బాధ్యతలు

అమరావతి: నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మళ్లీ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ అయింది.

నిన్న రాత్రి నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ధర్మాసనంలో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడే పునర్నియామకం ఉంటుందని తెలిపారు.

You might also like