FbTelugu

మరో రెండేళ్లు మారటోరియం: ఆర్‌బిఐ గవర్నర్

ముంబయి: గతంలో రెండు సంవత్సరాల పాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్లు మారటోరియం ఇస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) ప్రకటించింది.

ఇవాళ ముంబయిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడుతూ, సూక్ష్మ, చిన్న, ఇతర అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం అందిస్తామన్నారు. మార్చి 2022 వరకు కరోనా సంబంధి మౌలిక వసతుల కోసం రూ.50వేల కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఆర్థిక వనరులుల సన్నగిల్లినందున రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్ డ్రాఫ్ట్ (ఓడి) ఉపశమనం 36 రోజుల నుంచి 50 రోజులకు గడవు పెంచినట్లు ఆయన చెప్పారు. మే 20వ తేదీన రెండోసారి రూ.35వేల కోట్ల ప్రభుత్వ సెక్యురిటీల కొనుగోళ్లు ఉంటాయన్నారు. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల కోసం దీర్ఘకాలిక రెపో కార్యకలాపాలు, ప్రస్తుత రెపో రేటుకు రూ.10వేల కోట్లు, రుణ గ్రహీతకు రూ.10 లక్షల వరకు తాజా రుణాలు ఇవ్వనున్నామన్నారు.

ఈ సదుపాయం వచ్చే అక్టోబర్ నెలాఖరు వరకు ఉంటుందన్నారు. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోందని, కరోనా పరిస్థితులను ఆర్‌బిఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని ఆయన చెప్పారు. సూక్ష్మ, మధ్యతరగతి సంస్థలపై రెండో దశ కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యాపారం చేయాలో అందరూ నేర్చుకున్నారని శక్తికాంత దాస్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.