FbTelugu

ఏయిమ్స్ లో బూస్టర్ డోసుపై పరిశోధనలు

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఇస్తున్న కరోనా వ్యాక్సిన్ల జీవితకాలం ఆరు నెలలు కావడంతో బూస్టర్ డోసులపై పరిశోధనలు జరగుతున్నాయి. ఎక్కువ సామర్థ్యం కోసం బూస్టర్ డోసు అవసరమా లేదా అనే దానిపై పలు దేశాల్లో విస్తృతంగా పరిశోధనలు నిర్వహిస్తన్నారు.

ఢిల్లీలోని ఏయిమ్స్ లో కూడా నిర్వహిస్తున్నామని, రాబోయే రెండు మూడు నెలల్లో వివరాలు అందుబాటులోకి వస్తాయని మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ సంజీవ్ సిన్హా తెలిపారు. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అనుమతి పొందాయన్నారు. కరోనా బారి నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇది చాలా కీలక సమయం, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా వైరస్ అంటుకోకుండా ఉండేందుకు భౌతిక దూరం, శానిటైజర్ కచ్చితంగా వాడాల్సిందేనని తేల్చి చెప్పారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, ఇంట్లో నుంచే పనులు చేసుకోవాలని ఆయన కోరారు. కలిసి భోజనం చేయవద్దని, ఒక్కరు మాత్రమే చేసుకునేలా చూసుకోవాలని డాక్టర్ సిన్హా సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.