తిరుపతి: జిల్లాలోని పీలేరులో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. తీవ్రంగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే పించా నదిలో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించారు.
తాళ్ల సాయంతో నదిలో చిక్కుకున్న బాధితుల దగ్గరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుంది. బాధితులను తాళ్ల సాయంతోనే బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.