FbTelugu

రిపోర్టర్ వెంకటేశ్వర్ రావు కిడ్నాప్

ఖమ్మం: ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్ అనంచిన్ని వెంకటేశ్వర్ రావు ఈరోజు ఉదయం కిడ్నాప్ కు గురైనట్టు తెలుస్తోంది. ప్రతిరోజు ఉదయం వేళ మార్నింగ్ వాక్ కోసం వెళ్లే వెంకటేశ్వరరావు ఈరోజు వాకింగ్ కోసమని వెళ్లి తిరిగి రాలేదు.

ఖమ్మం కేంద్రంలో ముస్తఫా నగర్ లో నివసిస్తున్న వెంకటేశ్వర్ రావు ఈ రోజు మార్నింగ్ వాక్ కోసమని అగ్రహారం బ్రిడ్జి వైపు వెళ్లారు. ఆయన ఫోన్ స్విచాఫ్ కావండంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికాసేపట్లో ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తూ వార్తలు రాస్తున్న వెంకటేశ్వర్ రావును ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
తాజాగా తెలంగాణలో ఒక కుటుంబం అధికారాన్ని అడ్డంపెట్టుకుని చేస్తున్న తతంగం పై నిన్న కథనాన్ని ప్రచురించారు. నిన్న మొన్న ప్రచురించిన కథనాలకు, కిడ్నాప్ కు ఏదైనా సంబంధాలు ఉండవచ్చని ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.