FbTelugu

నకిలీ పాస్ పోర్టులపై నేడు హోం శాఖకు నివేదిక

హైదరాబాద్: నకిలీ పాస్ పోర్టు ల వ్యవహారం లో సైబరాబాద్, నిజామాబాద్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ రోజు సైబరాబాద్ పోలీసులు హోం శాఖకు నివేదిక అందజేయనున్నారు.

సూత్రధారి పరిమల్ బెన్, పూణే కు చెందిన ఓ ఏజెంట్, ఈ సేవ సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఆయుర్వేద వైద్యం పేరుతో 7సంవత్సరాల క్రితం బోధన్ కు వచ్చిన బంగ్లాదేశ్ కు చెందిన పరిమల్ బెన్ ఇక్కడే స్థిరపడ్డాడు. బాంగ్లాదేశ్, మయన్మార్ కు చెందిన చాలా మందిని బోధన్ లో జరీ వర్క్ కొరకు రప్పించాడు. వీరందరికి తప్పుడు అడ్రెస్ లతో ఆధార్ కార్డు లు తయారు చేయించాడు. స్పెషల్ బ్రాంచి ఎస్సై మల్లేష్ ఇంట్లో పరిమల్ బెన్ అద్దెకు ఉంటున్నాడు. ఈ సేవ సిబ్బంది సహకారంతో తప్పుడు అడ్రస్ లతో ఆధార్ కార్డులు సృష్టించి పని పూర్తి కానిచ్చేశాడు.
ఎస్సై మల్లేష్, ఏఎస్సై అనిల్ సహకారంతో ఇప్పటి వరకు 75మందికి పాస్ పోర్టులు జారీ చేయించాడు. పోలీసుల అదుపులో 8మంది ఉండగా, ఆచూకీ లేని మరో 67మంది కోసం గాలింపు ముమ్మరం చేశారు. అయితే వీరంతా దుబాయ్ వెళ్లినట్టు గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.