FbTelugu

డబ్బులిస్తే వైరస్ లేదని రిపోర్టు ఇస్తాం…

లక్నో: మేము కోరినంత డబ్బులు ఇస్తే కరోనా పాజిటివ్ లేదని రిపోర్టు ఇస్తామని రోగులతో బేరమాడిన హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు సీజ్ చేశారు.
ప్రజారోగ్యంతో చెలగాటమాడినందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. మీరట్ నగరంలో ఒక హాస్పిటల్ లో ఈ ఘటన జరిగింది.

రూ.2500 ఇస్తే కరోనా వైరస్ రాలేదని రిపోర్టు ఇస్తామని హాస్పిటల్ సిబ్బంది బేరం నడిపిస్తున్నారు. బేరమాడుతున్న వీడియో వైరల్ గా మారంతో ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే వారు హాస్పిటల్ కు వెళ్లి సీజ్ చేశారు. ఆ తరువాత లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
కరోనా పాజిటివ్ లేదని రిపోర్టు ఇస్తామని చెప్పడం అనైతికం అని, ఇలా ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాని డీఎం అండ్ హెచ్ఓ అనిల్ ధింగ్రా హెచ్చరించారు.

You might also like