FbTelugu

ఏపి లో 4 ఎమ్మెల్సీలు భర్తీ!

అమరావతి: ఆంధ్రాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న ఈ స్థానాలను భర్తీ చేసేందుకు సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారు.

శుక్రవారం ఖాళీ కానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. నలుగురి పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయం రాజ్ భవన్ కు ఫైలు పంపినట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందంటున్నారు. లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), తోట త్రిమూర్తులు (తూర్పుగోదావరి), మోషేను రాజు (పశ్చిమ గోదావరి), ఆర్.వి.రమేశ్‌యాదవ్‌ (కడప ) పేర్లు ప్రతిపాదించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.