FbTelugu

3 ప్రైవేటు హాస్పిటళ్ల లైసెన్స్ పునరుద్ధరణ

హైదరాబాద్: నగరంలో మూడు కార్పొరేట్ హాస్పిటళ్ల లైసెన్స్ లను పునరుద్దరిస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు హాస్పిటళ్లు కరోనా రోగుల నుంచి పెద్ద ఎత్తున దోపిడి చేసినట్లు ఫిర్యాదు రావడంతో లైసెన్స్ లు రద్దు చేసిన విషయం తెలిసిందే.

సికింద్రాబాద్ మినిష్టర్ రోడ్డులోని కిమ్స్, లక్డీకపూల్ లో లోటస్ హాస్పిటల్, గచ్చిబౌలి లోని సన్ షైన్ హాస్పిటల్ లు కరోనా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులపై విచారణ జరిపిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మూడు హాస్పిటళ్లలో కరోనా చికిత్సలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మూడు యాజమాన్యాలు ఇక నుంచి అలా జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం, కరోనా చికిత్సలకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు చర్యలు నిలిపివేసినట్లు తన ఉత్తర్వులో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.