FbTelugu

తాండూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ పై వేటు

క్రిమినల్ కేసు నమోదు కు ఆదేశం
హైదరాబాద్: మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో దొంగ ఓటు వేసినట్లు నిర్థారణ కావడంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ పై వేటు వేయాలని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆదేశించారు.

ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాండూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ తాటికొండ స్వప్ప ఓటు వేసింది. తనకు ఓటు హక్కు లేకపోయినప్పటికి మరొకరి పేరుతో ఉన్న ఓటును తన ఓటు గా వేసింది. పలువురు ప్రధాన ఎన్నికల అధికారి కి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవం వెల్లడి కావడంతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగించడమే కాకుండా క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.