FbTelugu

నేడో రేపో మంత్రి ఈటలపై వేటు?

హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం నుంచి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల ను తప్పిస్తారా అంటే అవుననే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గం నుంచి నేడో రేపో సిఎం కెసిఆర్ తప్పించనున్నట్లు తెలిసింది.

మెదక్ జిల్లా మసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ శివారులో మంత్రి ఈటల రాజేందర్ జమున హేచరీస్ పేరుతో ఫౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసేందుకు భూమి తీసుకున్నారు. అసైన్డు భూములు కావడంతో రెగ్యులరైజ్ చేయాలని అప్పటి మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డిపై ఒత్తిడి చేశారంటున్నారు. ధర్మారెడ్డికి పలుమార్లు ఈటల రాజేందర్ ఫోన్ చేశారన్నారని తెలిసింది. రెగ్యులరైజ్ చేసేందుకు డబ్బులు చెల్లిస్తామని మంత్రి చెప్పినా కుదరదని చెప్పారు. అసైన్డు భూముల రెగ్యులరైజ్ కు ప్రభుత్వం జిఒ జారీ చేసిందని, అది కూడా భూమి లేనివారు అయితే చేయాలని కలెక్టర్ చెప్పినట్లు తెలిసింది. జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ ను కూడా మంత్రి ఈటల సంప్రదించగా, ఈ విషయంలో ఏమీ చేయలేనని చెప్పినట్లు సమాచారం.

తమ భూములను ఈటల రాజేందర్ బలవంతంగా బెదిరించి తీసుకున్నారని తమకు తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు కొద్ది రోజుల క్రితం సిఎం కెసిఆర్ ను ఆశ్రయించారు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ దందాపై కెసిఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి, విచారణకు ఆదేశించారని సమాచారం. ఈ భూములను మంత్రి ఈటల భార్య జమునా రెడ్డి, కుమారుడు నితిన్ రెడ్డి పేరుతో కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు. కొద్ది రోజులుగా ఈటల కొరుకుడు పడని విధంగా విమర్శలు చేస్తుండడంతో సమయం కోసం కెసిఆర్ ఎదురు చూస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో వేటు వేసేందుకు కెసిఆర్ దాదాపు సిద్ధమయ్యారని తెలిసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.