FbTelugu

రెమిడెసివిర్ ధరలు తగ్గాయి…

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అడ్వకేట్ ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం కరోనా రోగుల చికిత్సలో ముఖ్యమైన యాంటివైరల్ మెడిసిన్ ధరలు తగ్గించింది. పాజిటివ్ రోగులకు ఊరటనిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. రెమిడెసివిర్ ఉత్పత్తిదారులు, మార్కెటింగ్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు బ్యాచ్ నెంబర్ తో సంబంధం లేకుండా ఈ డ్రగ్ ను ఎం.ఆర్.పి ని తగ్గించాలని కేంద్ర స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచే ఈ ధరలను వినియోగంలోకి తేవాలని, ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని సూచించింది.

దేశంలో ప్రస్తుతం 38.80 లక్షల రెమిడిసివిర్ ఇంజెన్లను పలు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. దీనికి అదనంగా ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం కంపెనీలకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఫలితంగా మరో 40 లక్షల ఇంజెక్షన్లు అదనంగా ఉత్పత్తి చేసే అవకాశం లభించింది. కేంద్ర ఆదేశం ప్రకారం తగ్గించిన ధరలు ఇలా ఉన్నాయి.
కంపెనీ – బ్రాండ్ పేరు -పాత ధర – కొత్త ధర
క్యాడిలా హెల్త్ కేర్ – రెమ్ డ్యాక్ – రూ.2800 – రూ.899
సింజిన్ ఇంటర్నేషనల్ – రెమ్ విన్ – రూ.3950 – రూ.2450
డాక్టర్ రెడ్డీస్ – రెడిక్స్ – రూ.5400 – రూ.2700
సిప్లా – సిప్ రెమి – రూ.4000 – రూ.3000
మైలాన్ – డెస్ రెమ్ – రూ.4800 – రూ.3400
జూబ్లియంట్ – జుబి ఆర్ – రూ.4700 – రూ.3400
హెటిరో – కోవిఫర్ – రూ.5400 – రూ.3490.

You might also like

Leave A Reply

Your email address will not be published.