FbTelugu

త్వరలో కరోనా నుంచి రెమిడెసివిర్ ఔట్

న్యూఢిల్లీ: కరోనా చికిత్సలో కీలకంగా చెప్పబడుతున్న ఫ్లాస్మా థెరఫికి కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ నుంచి తొలగించింది. త్వరలోనే రెమిడెసివిర్ ఇంజెక్షన్ ను కూడా తొలగించనున్నట్లు తెలుస్తోంది.

కరోనా చికిత్స ప్రొటోకాల్ నుంచి రెమిడెసివిర్ ఇంజెక్షన్ ను తొలగించాలని భవిస్తున్నామని సర్ గంగారామ్ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ డిఎస్.రాణా తెలిపారు. తీవ్ర స్థాయికి చేరుకున్న వారికి దీన్ని ఉపయోగిస్తున్నప్పటికీ బాధితులపై ఎలాంటి ప్రభావం చూపించడం లేదని, ఆధారాలు కూడా లభ్యం కావడం లేదన్నారు. ఇప్పటికే ఫ్లాస్మా చికిత్సను ప్రొటోకాల్ నుంచి తొలగించారన్నారు. కరోనా బారినపిన వారి నుంచి సేకరించిన యాంటీబాడీలతో ఉన్న ఫ్లాస్మా  కరోనా క్రిటికల్ రోగులపై ప్రయోగించగా ఎలాంటి ప్రభావం చూపించడం లేదన్నారు. ఎలాంటి ప్రభావం లేకపోవడంతో ప్రొటోకాల్ నుంచి ఫ్లాస్మా థెరఫిని ఐసిఎంఆర్ తొలగించిందన్నారు.

దేశంలో ప్రస్తుతం రెమిడెసివిర్ ఇంజక్షన్ వినియోగించిన తరువాత ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదన్నారు. దీన్ని కూడా త్వరలో ప్రొటోకాల్ నుంచి నిలిపివేయాలని సూచించామని డాక్టర్ రాణా తెలిపారు. త్వరలో ఈ ఇంజెక్షన్ ను కూడా తొలగిస్తారని ఆయన వివరించారు. దేశ వ్యాప్తంగా రెమిడెసివిర్ కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డాక్టర్ రాణా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.