FbTelugu

ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో రెమిడెసివిర్ దందా

విచారిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్
అమరావతి: మంగళగిరి ఎన్.ఆర్.ఐ హాస్పిటల్ లో మరో భారీ స్కామ్ జరిగింది. దాదాపుగా రూ.1 కోటి కి పైగా విలువైన రెమిడెసివిర్ ఇంజెక్షన్ వాయిల్స్ ను పక్కదారి పట్టించారు.
గతంలో ఎన్ఆర్ఐ హస్పిటల్ లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన ఒక వ్యక్తి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

విజయవాడ లో సొంతంగా క్యారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. సొంత క్వారంటైన్ సెంటర్ కోసం ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి ఇండెంట్ పెట్టి కొనుగోలు చేశారు. విజయవాడ క్యారంటైన్ సెంటర్ లో రెమిడెసివిర్ ఇంజెక్షన్ వాయిల్స్ ను 10 రేట్లు అధికంగా విక్రయించి లక్షలు సొమ్ము చేసుకున్నాడు. ఫిర్యాదులు రావడంతో ఇంజెక్షన్ కి సంభందించిన జి.ఎస్.టి బిల్లు ఆధారంగా విచారణ చేపడుతున్నారు. అంత భారీ నగదు హెటిరో డ్రగ్ కంపెనీ కి ఎవరో చెల్లింపు చేశారనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఎన్ఆర్ఐ కుంభకోణంపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిజి రాజేంద్రనాద్ రెడ్డి కి అధికారపార్టీ నేతలు పిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన విజిలెన్స్ అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.