FbTelugu

ఇక కావాల్సినంత రెమిడెసివిర్

న్యూఢిల్లీ: బహిరంగ మార్కెట్ లో రెమిడిసివిర్ ఇంజక్షన్ వాయిల్స్ కావాల్సినన్నీ లభ్యమవుతుండడం, ఉత్పత్తి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం మీద భారం తగ్గింది. గత వారం రోజుల నుంచి రెమిడెసివిర్ కావాలని ఎవరూ అడగడం లేదు.

కేంద్ర ఆరోగ్య శాఖ కూడా రెమిడెసివిర్ ఇంజక్షన్ ను కరోనా చికిత్స నుంచి తొలగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెమిడెసివిర్ ఇంజక్షన్ బాధ్యతల నుంచి తప్పుకున్నది. ఈ విషయాన్ని కేంద్ర కెమికల్స్ అండ్స్ ఫర్టిలైజర్స్ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా తెలిపారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ముప్పు ప్రారంభమైన సందర్భంగా ఈ ఔషధం కీలకంగా మారింది. ఏప్రిల్ రెండోవారం నాటికి దేశంలో ప్రతిరోజు 33వేల వాయిల్స్ మాత్రమే తయారు అయ్యేవి. డిమాండ్ నాలుగింతలు ఉండడంతో మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్ మార్కెట్ చేసి కోట్లాది రూపాయలు దండుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించాయి. ఉత్పత్తి, డిమాండ్ మధ్య వ్యత్యాసం భారీగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రోజుకు 3.50 లక్షల వాయిల్స్ కు పెరిగింది. అమాంతం 3.17 లక్షల వాయిల్స్ పెరగడంతో బ్లాక్ మార్కెట్ తగ్గుముఖం పట్టింది. కొరతను అధిగమించేందుకు ఉత్పత్తి సంస్థల సంఖ్యను 20 నుంచి  60కి పెంపుదల చేశారు.  దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కరోనా చికిత్స ప్రొటోకాల్ నుంచి రెమిడెసివిర్ ను తొలగించింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం రెమిడెసివిర్ బాధ్యతల నుంచి తప్పించుకున్నట్లు ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.