FbTelugu

రాజకుటుంబం… జూ పార్క్ అనిపించేది!

వాషింగ్టన్: బ్రిటన్ రాజకుటుంబం నాటి జీవనాన్ని ప్రిన్స్ హ్యారీ గుర్తు చేసుకున్నారు. రాజ కుటుంబంలో ఉన్నన్ని రోజులు ఒక జూ పార్క్ లో ఉన్నట్లుగా ఉండేదని ప్రిన్స్ హ్యారీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

కట్టుబాట్లు, రాచరికం జీవితంలో ఇమడలేక ఆయన గతేడాది బకింగ్ హ్యామ్ ప్యాలెస్ ను వీడి సాధారణ జీవితంలోకి ప్రవేశించారు. రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా విదిలించుకుని బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ది ట్రూమ్యాన్ షో మువీలో హీరో పరిస్థితిలా నాది ఉండేదని అన్నారు. అనుక్షణం కెమెరాల నిఘా, వ్యక్తిగత సిబ్బంది మధ్య స్వేచ్ఛ లేకుండా బతుకు వెళ్లదీశానన్నారు. ఈ బంధనాలు, బంధుత్వాల నుంచి విడిపోవాలని పలుమారు యోచించానని, చివరకు కఠిన నిర్ణయం తీసుకున్నానన్నారు. భార్య, మేఘన్, కుమారుడు ఆర్చీ గురించే ఎక్కువగా భయపడేవాడిననని, వారు కూడా తన తల్లి డయానా మాదిరి ఇబ్బందుల పడతారేమోనన్న ఆందోళన ఉండేదన్నారు. తన తల్లికి జరిగిన అవమానం చూసిన తరువాత రాజకుటుంబం బాధ్యతలు నిర్వర్తించాలని అన్పించలేదని ప్రిన్స్ హ్యారీ చెప్పారు. ఆయన భార్య కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.