FbTelugu

రిమాండ్ ఖైదీ సూసైడ్.. ముగ్గురు అధికారులపై సస్పెన్షన్

: జిల్లాలోని తెనాలి సబ్ జైలులో ఓ రిమాండ్ ఖైదీ సుసైడ్ చేసుకొని మృతిచెందగా.. గుండెపోటుతో మృతిచెందాడంటూ తెలిపిన ముగ్గురు జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకెళితే.. తెనాలి సబ్ జైలులో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడని జైలు అధికారులు తెలిపారు. కాగా మృతుని మెడపై గాట్లు ఉండడంతో మృతుని కుమారుడు తీవ్ర అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పరీక్షించగా అసలు విషయం బయటపడింది. అతరు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. గుండెపోటుతో మృతి చెందినట్టు తప్పుదోవ పట్టించారని వెల్లడైంది. దీనికి బాధ్యులైన జైలు ఇంచార్జ్ సూపరింటెండెంట్ రాములు నాయక్, జైలు సిబ్బంది చిట్టిబాబు, రంగారావు లను జిల్లా జైళ్లశాఖ అధికారి ఆర్.వీ. ప్రసాద్ సస్పెండ్ చేశారు.

You might also like