FbTelugu

మాకొద్దు బాబూ వ్యాక్సిన్… రష్యా డాక్టర్ల విముఖత!

మాస్కో: రష్యా దేశంలో కరోనా వ్యాక్సిన్ పేరు చెబితే పరుగులు పెడుతున్నారు. మాకొద్దు అంటూ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. దేశంలో సగం మందికి పైగా డాక్టర్లు ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

రష్యా లోని గమలేయ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏపిడమాలజీ అండ్ మైక్రో బయాలజీ స్పుత్నిక్-వీ పేరుతో వ్యాక్సిన్ తయారు చేసింది. తొలుత ఈ వ్యాక్సిన్ డాక్టర్లు, టీచర్లకు వేస్తామని అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్బీసీ వెబ్ ఫోర్టల్ ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. దేశంలో మూడు వేల మందికి పైగా డాక్టర్లు ఈ ఆన్ లైన్ సర్వేలో పాల్గొన్నారు. కేవలం 24 శాతం మంది మాత్రమే వేసుకునేందుకు ముందుకు వచ్చారు. 66 శాతం మంది మాత్ర వ్యాక్సిన్ ప్రభావాన్ని రుజువు చేయడానికి తగినంత డేటా లేదని చెప్పడం విశేషం. 48 శాతం మంది మాత్రం దీనిని త్వరగా అభివృద్ధి చేశారని, నాణ్యత ఉండకపోవచ్చని చెప్పారు.

You might also like