FbTelugu

భైంసాలో మతసామరస్యం దెబ్బతీస్తున్నారు: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: భైంసాలో మతసమరస్యాన్ని దెబ్బతీయలని కొందరు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. భైంసా ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి,నిందితులను కఠినంగా శిక్షించాలి తెలంగాణ డీజీపీని కోరారు.

భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాస్వత పరిష్కారం చేయాలని డీజీపీని అదేశించామని ఆయన తెలిపారు. భైంసాలో ఉన్న  పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. గడచిన 30 ఏళ్ళుగా ఓ వర్గం వారి మీద మరో వర్గం వారిపై దాడులకు దిగుతున్నారనే వార్తలు వచ్చాయి, వీటి వెనుక కుట్ర ఉందని తెలుస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.