FbTelugu

ఏపీలో మతవ్యాప్తి ప్రభుత్వం: కన్నా

గుంటూరు: రాష్ట్రంలో వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బడిని, గుడిని వదలని వైసీపీ వాళ్ళు, అవకాశం వుంటే ఇసుకకి, ఇంద్రధనస్సు కి వైసీపీ రంగులు వేసేలా వున్నారని ఘాటుగా స్పందించారు. అన్నవరం దేవాలయంలో అన్యమత ప్రచారం, ఐలాండ్ లో అర్చీల పై బొమ్మల ఏర్పాటు, విశాఖ భీమిలి ఉత్సవ్ లో మతపరమైన స్టాల్స్ ఏర్పాటు ఎలా చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం మత వ్యాప్తి ని సూచిస్తుందని ట్విట్టర్ లో కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More