FbTelugu

ముకేశ్ భాయ్… ఇది ఝలక్ మాత్రమే!

ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం ముందు మందుగుండు సామగ్రితో ఉన్న ఒక వాహనాన్ని కనుగొన్న విషయం తెలిసిందే.
ఈ వాహనంలో పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొనడంతో కలకలం రేగిన విషయం తెలిసింది. ముకేశ్ ఇంటి సమీపంలో పార్కింగ్ చేసిన ఎస్.యూ.వీ వెహికిల్ లో పోలీసులకు లేఖ లభించింది. ముకేశ్ భాయ్…

ఇది ఝలక్ మాత్రమే. గుర్తు పెట్టుకో భాయ్. వచ్చేసారి వాహనంలో పేలుడు పదార్థాలు నిండా నింపి పార్కింగ్ చేస్తాం అంటూ లేఖలో హెచ్చరించారు. ముంబై ఇండియన్స్ తో మరో చేతి సంచి కూడా లభించడంతో పోలీసులు లోతుగా విచారణ జరపుతున్నారు.
సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను చూసిన పోలీసులు వాహన యజమానిని పట్టుకున్నారు. యజమాని హిరేన్ ముంకుష్ దక్షిణ ముంబయి పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఎస్.యు.వీ వాహనం తనదనేనని, చోరీకి గురైందని వాంగ్మూలం ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.