FbTelugu

జీ 23 కి కత్తెర వేసిన కాంగ్రెస్ పార్టీ

న్యూఢిల్లీ: జీ 23 పేరుతో కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన నేతలను అధిష్టానం పక్కనపెట్టేసింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం ఇవాళ స్టార్ క్యాంపెనయర్ల జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్, ప్రియాంకా వాద్రా, మల్లికార్జున ఖర్గే, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు కలిపి మొత్తం 30 మంది వకు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టు పార్టీలు, ఇండియన్ సెక్యులర్ పార్టీలతో కలిసి కాంగ్రెస్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికారం కాపాడుకునేందుకు సీఎం మమతా బెనర్జీ, అధికారం దక్కించుకునేందుకు బీజేపీ లు హోరాహోరీ తలపడుతున్నాయి. గతం కన్నా ఎక్కువ సీట్లు సంపాదించేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

జీ 23 పేరుతో సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్శ తదితరులు వేరు కుంపటి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ప్రశ్నలు సంధిస్తూ పరోక్షంగా బీజేపీకి సహాయపడ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీని ఇరుకునపెట్టే విధంగా వ్యవహరిస్తున్న జీ 23పై రాహుల్ గుర్రుగా ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.