FbTelugu

తెలంగాణ ఇంటర్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూలు విడుదల చేశారు. మే 1వ తేదీ నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, మే 2 నుంచి 20వ తేదీ వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షా సమయం అని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఏ రోజు ఏ పరీక్షలు జరిగేది ఇంటర్మీడియట్ వెబ్ సైట్ లో ఉన్నాయని పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.