FbTelugu

రైతు బంధు నిధులు విడుదల

హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రూ.5294 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.

బ్యాంకు వివరాలు లేకపోవడంతో ఐదు లక్షల మంది రైతులకు నిలిపివేశారు. ఖాతా వివరాలు అందచేయగానే నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నవారందరికీ పెట్టుబడి సాయం మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సోమవారం సాయంత్రం మొత్తం 50.84 లక్షల మంది రైతు ఖాతాలకు రూ.5294 కోట్ల రూపాయలు జమ చేశారు. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ఈ బడ్జెట్ లో రూ.14 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులైన 63477 మంది రైతులకు కూడా రూ.82.37 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

You might also like