FbTelugu

కోబ్రా కమాండో రాకేశ్వర్ విడుదల

బీజాపూర్: కుటుంబం విన్నపాలు, ప్రజా సంఘాల వినతులతో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ కు విముక్తి లభించింది. గత ఐదు రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్న ఆయనను ఇవాళ తెర్రం పోలీసు స్టేషన్ పరిధిలో వదిలేశారు.
కొద్ది సేపట్లో ఆయన బెటాలియన్ ఉంటున్న ప్రాంతానికి చేరుకోనున్నారు. గతవారం బీజాపూర్ లో జరిగి ఎన్ కౌంటర్ సందర్భంగా మావోయిస్టులు రాకేశ్వర్ సింగ్ ను బందీగా తీసుకువెళ్లారు. తమ నిర్బంధంలో క్షేమంగా ఉన్నాడని, పోలీసులు తమ సోదరులేనంటూ ఒక లేఖ విడుదల చేశారు. కమాండోను వెంటనే విడుదల చాలని నిర్బంద వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్, కో కన్వీనర్లు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్ కోరారు. కేంద్ర, రాష్ట్రాలు శాంతి చర్చల దిశగా చర్యలు చేపట్టాలని వేదిక వినతి చేసింది.

రాకేశ్వర్ ను విడుదల చేయాలంటూ జమ్మూలోని ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ప్రార్థించారు. సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు కూడా ఆయనకు ఎలాంటి హాని తలపెట్టవద్దని వదిలేయాని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.