FbTelugu

400 మంది తాలిబన్ ఖైదీల విడుదల

ఆమోదించిన ఆఫ్గనిస్థాన్ ప్రభుత్వం

కాబూల్: తాలిబన్ ఉగ్రవాదులను విడుదల చేశారని కంగారు పడుతున్నారా?. ఇది నిజంగానే జరిగింది. 400 మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసేందుకు ఆ దేశ గ్రాండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో వీరి విడుదలకు మార్గం సుగమమైంది.

అంతర్గత చర్చలకు తక్షణమే రావాలని తాలిబన్లను దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కోరారు. సమావేశాలు ముగింపు రోజైన ఆదివారం నాడు ఘనీ మాట్లాడుతూ 400 మంది తాలిబన్ ఖైతీల విడుదలకు ఈ రోజే సంతకం చేస్తానని ప్రకటించారు. వీరంతా తిరిగి యుద్దం చేయరని, వారి కార్యకలాపాలపై పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి, ప్రజలకు హామీ ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
వీరి విడుదలతో ప్రభుత్వం, తాలిబన్ల మధ్య శాంతి చర్చలకు మార్గం సుగమం అవుతుందని దేశ ప్రజలు భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ గ్రాండ్ అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశానికి మత పెద్దలు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

You might also like