FbTelugu

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ పరీక్షలు జూన్ 8న ప్రారంభమై జులై 5 న ముగియనున్నాయి. ప్రతి పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు జరుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
08-06-2020 – ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌
11-06-2020 -ఇంగ్లీష్‌ రెండో పేపర్‌
14-06-2020 -గణితము మొదటి పేపర్‌
17-06-2020 -గణితము రెండో పేపర్‌
20-06-2020 -(భౌతిక శాస్త్రం) మొదటి పేపర్‌
23-06-2020 -(జీవశాస్త్రం) రెండో పేపర్‌
26-06-2020 -సోషల్‌ స్టడీస్‌ మొదటి పేపర్‌
29-06-2020 -సోషల్‌ స్టడీస్‌ రెండో పేపర్‌
02-07-2020 -ఓరియంటల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌(సంస్కృతం          మరియు అరబిక్‌)
05-07-2020 -ఒకేషనల్‌ కోర్సు(థియరీ)

You might also like

Leave A Reply

Your email address will not be published.