FbTelugu

ఏపిలో 8 జిల్లాల్లో ఆంక్షల సడలింపు

అమరావతి: కరోనా పాజిటివ్ కేసులు 5 శాతం తక్కువగా నమోదు అవుతుండడంతో కొన్ని జిల్లాల్లో ఆంక్షలు సడలించారు. ఈ జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలకు అనుమతించారు.

రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనున్నది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మాత్రం సాయంత్రం 6 వరకే అనుమతించారు. ఈ జిల్లాల్లో కరోనా కేసుల నమోదు 5 శాతం కన్నా ఎక్కువగా ఉంది. జూలై 7వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఆ తరువాత మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు. ఆంక్షల సడలింపుపై ఇవాళ సిఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.