FbTelugu

ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పటిష్ట భద్రత

అమరావతి: వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. తనకు ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలతో ముప్పు ఉందంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్రానికి ఫిర్యాదు చేశాడు.

రఘురామకృష్ణం రాజు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం 11 మందితో కూడిన “వై” కేటగిరి భద్రత సమకూర్చనున్నట్టు తెలిపింది. వైసీపీ ఎంపీ అయి ఉండి సొంత పార్టీ నేతలపైనే అనేక మార్లు రఘురామకృష్ణం రాజు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

You might also like