FbTelugu

సర్వర్ సమస్యతో ఆగిన రిజిస్ట్రేష‌న్లు

హైదరాబాద్: కంప్యూటర్ స‌ర్వ‌ర్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో రాష్‌్ర వ్యాప్తంగా రిజిస్ట్రేష‌న్లు నిలిచిపోయాయి. ఈ స‌మ‌స్య‌తో రెండు రోజులుగా న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్న రిజిస్ట్రేష‌న్లు ఇవాళ పూర్తిగా ఆగిపోయాయి.
ఇవాళ‌ ఉదయం 10 గంటల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఇంకా స‌ర్వ‌ర్ క‌నెక్ట్ కాలేదు.

దీంతో క్ర‌య విక్ర‌య‌దారులు రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకున్నవారు రావడంతో కార్యాలయాలు జనంతో నిండిపోయాయి. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో మ‌ధ్యాహ్నం వర‌కే ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ప‌ని చేస్తుండటంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌తో రిజిస్ట్రేష‌న్లు నెమ్మ‌దిగా సాగుతున్నాయ‌ని అధికారులు తెలిపారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఐటీ విభాగం శ్ర‌మిస్తోంద‌ని, ఎప్పటికి పరిష్కారం అవుతుందో చెప్పలేమని వివ‌రించారు. ఇవాళ స్లాట్ బుక్ చేసుకున్నవారికి మరోరోజు సమయం కేటాయించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.