హైదరాబాద్: మూడు నెలలుగా నిలిచిపోయిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు మోక్షం లభించింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అడ్డంకులు తొలగిపోయాయి.
శుక్రవారం నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారన్నారు. ప్రస్తుతం ధరణి వెబ్ సైట్ ద్వారా వ్యవసాయ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇకనుంచి వ్యవసాయేతర ఆస్తులను కూడా చేయనున్నారు.
హైకోర్టు కేసు కారణంగా గత మూడు నెలలుగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లపై ఆగమ్యగోచరం నెలకొంది. వందలాది కోట్ల రూపాయల లావాదేవీలు ఆగిపోయాయి. ఎట్టకేలకు హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపరిపీల్చుకున్నది.