FbTelugu

ఆ భూముల రిజిస్ట్రేషన్ బంద్: కేసీఆర్

హైదరాబాద్: ఇక నుంచి రాష్ట్రంలో ఎండోమెంట్స్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీలో నూతన రెవెన్యూ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ పై విషయాన్ని వెల్లడించారు.

దేవాదాయ భూములు, వక్ఫ్ భూముల్లో క్రయ విక్రయాలు, లావాదేవీలు జరగకుండా ఉండేందుకు ఆటో లాక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎండోమెంట్స్ భూములను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమేనని, పీటముడి పడి పరిష్కారం దొరకని అనేక సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని సీఎం తెలిపారు.

సమైక్యాంధ్రలో రెవెన్యూ 160కి పైగా చట్టాలు ఉండేవని, ఇప్పుడు 87 చట్టాలు మాత్రమే చేసి సులభతరం చేశామన్నారు. రెవెన్యూ కోర్టులోల 16వేల కేసులు, హైకోర్టు 2వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

You might also like