FbTelugu

ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ మరింత ఆలస్యం…

హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తులైన అపార్ట్ మెంట్ ఫ్లాట్లు, ఇళ్ళ స్థలాల రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడం మరో వారం రోజులు సమయం తీసుకోనున్నది.
హైకోర్టులో ధరణి ఫోర్టల్ పై కేసు నడుస్తుండడం, దీనిపై ఈనెల 23వ తేదీన విచారణ ఉండడంతో ప్రభుత్వం వాయిదా వేసింది.

ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 23 నుండి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగినట్లుగా అధికార యంత్రాంగం కసరత్తులు కూడా చేస్తున్నది. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ కారణాల చేత 23 వ తేదీ బదులు మరో నాలుగైదు రోజుల పాటు వాయిదా పడే అవకాశముంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.