FbTelugu

‘విద్యార్థులకు ర్యాంకులు, మార్కులు ఇవ్వొద్దు’

అమరావతి: విద్యార్థులకు టెస్టులు పెట్టి మార్కులు, ర్యాంకులు ఇవ్వకూదంటూ.. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చిన వీర భద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రీజినల్ జాయింట్ డైరెక్టర్ లు, డిఈఓ లు ప్రత్యేక నిబంధనల అమలు చేయాలని తెలిపారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని ఆదేశించారు.

ఇందుకు ప్రత్యామ్నాయ విద్యా సంవత్సర క్యాలెండర్ ను ఎన్సిఈఆర్టీ సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ క్యాలండర్ ను స్కూళ్లు పాటించాలని ఆదేశించారు. ఆన్లైన్ అభ్యాసం కొనసాగించడాన్ని ప్రోత్సహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులొస్తున్నాయి. రాష్ట్రంలో ఇంకా అకడమిక్ క్యాలెండర్ తయారు కాలేదు. పనిదినాలు, సిలబస్ తగ్గిపు ద్వారా విద్యార్థుల అభ్యాసం పై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. టీచర్లు సోషల్ మీడియా, టెక్నాలజీ సాయంతో పాఠశాలల్లో అకడమిక్ విద్య తిరిగి ప్రారంభమయ్యేవరకు విద్యార్థులకు అందించాలని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.