లాహోర్: వాహనదారులకు ఊరటనిచ్చే విధంగా పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పతనం కావడం, వినియోగం తగ్గడంతో లీటర్ పెట్రోల్ పై రూ.20 తగ్గించింది. అదే విధంగా డీజీల్, ఎల్పీజీ ధరలను కూడా తగ్గిస్తూ ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయం తీసుకున్నది. తగ్గించిన ధరలు ఇవ్వాాల్టి అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తో చర్చించిన తరువాతే పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను అమాంతం తగ్గించిందని డాన్ పత్రిక తన కథనంలో పేర్కొంది.