FbTelugu

బెంగాల్ లో తగ్గిన పెట్రోల్ ధరలు

కొలకతా: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. రెండు ప్రభుత్వాలు పోటీ పడి పన్నులు వసూలు చేస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలకు శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నామని, ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రెండు రకాల ఇంధనాలపై రూపాయి చొప్పున తగ్గిస్తున్నామని తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అమిత్ మిత్రా వెల్లడించారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు టాక్స్ తగ్గించామని ఆయన అన్నారు. కేంద్రం పెట్రోల్ పై ట్యాక్స్ ల రూపంలో రూ.32.90 వసూలు చేస్తుండగా, రాష్ట్రానికి రూ.18.46 మాత్రమే తిరిగి చెల్లిస్తున్నదని అన్నారు.

అదే విధంగా డీజిల్ పై లీటర్ కు రూ.31.80 తీసుకుంటూ రాష్ట్రానికి రూ.12.77 మాత్రమే ఇస్తున్నదన్నారు. రాష్ట్రానికి కన్నా కేంద్ర ప్రభుత్వమే ఎక్కు మొత్తం పన్నులు వేస్తున్నదని మంత్రి విమర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఇంధన ధరలు తగ్గించామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.