FbTelugu

తమిళనాడులో అమాంతం తగ్గిన విమానాలు

చెన్నై: తమిళనాడులో సంపూర్ణ లాక్ డౌన్ కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం చూపిస్తున్నది. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల సంఖ్య తగ్గడంతో 104 విమానాలు రద్దు అయ్యాయి. ఇంటర్నేషనల్ టెర్మినల్ నుంచి కేవలం 10 విమానాలు మాత్రం టేకాఫ్ అయ్యాయి. స్వదేశీ టెర్మినల్ నుంచి 50 బయలుదేరగా, మిగతా నగరాల నుంచి 49 ల్యాండ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి రోజులు 270 స్వదేశీ విమానాలు రాకపోకలు సాగించేవి. సోమవారం నుంచి విమాన రాకపోకలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. ప్రయాణీకులు రాకపోవడంతో విమానాలను రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. ఎక్కువగా వలస కార్మికులు ప్రయాణిస్తున్నారని, టూరిస్టులు, వ్యాపారులు రావడం లేదంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.