FbTelugu

 గాల్వన్ లోయలో వెనక్కి తగ్గిన చైనా?

కాశ్మీర్: గాల్వన్ లోయలో రెండు కిలోమీటర్ల దూరం చైనా భద్రతా బలగాలు వెనక్కి తగ్గినట్లు వార్తలొస్తున్నాయి. చైనా దేశం వెనక్కి తగ్గినట్లు ఇండియాకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.
వివాదాస్పద ప్రాంతంలో రెండు దేశాలను చెందిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు. గత నెల 15వ తేదీన గల్వాన్ లోయలో ఎక్కడైతే ఘర్షణ జరిగిందో… అక్కడినుంచి చైనా బలగాలను ఉపసంహరించినట్లు తెలిసింది.

గత నెల 30వ తేదీన రెండు దేశాల కార్ప్స్ కమాండ్ స్థాయి అధికారుల ఒప్పందం ప్రకారం లోయలో సర్వే చేపట్టారు. ఉద్రిక్తంగా మారిన గాల్వన్, పాన్ గాంగ్, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి పంపాలని తీర్మానం చేశారు. సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా సామరస్యంగానే పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

You might also like