FbTelugu

ఉప ఎన్నికకు రెఢీ: వల్లభనేని వంశీ

విజయవాడ: మూడు రాజధానులపై రెండు ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్న సమయంలో టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒక్క అమరావతి ప్రాంతంలోనే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేనందున, అందరినీ సమానంగా చూడాలనే లయ్యంతో మూడు రాజధానులు సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని వంశీ తెలిపారు. ఒక్క అమరావతినే కేంద్రంగా చేస్తే భవిష్యత్తులో తెలంగాణ మాదిరి ప్రాంతీయ అసమానతలు ఏర్పడి, ఉద్యమాలు వచ్చే ప్రమాదముందన్నారు. గన్నవరం నియోజకవర్గం ఉప ఎన్నికలకు సిద్దమేనని, ఈ విషయాన్ని సీఎం జగన్ కు తెలిపానని అన్నారు.

కరోనా వైరస్ విజృంజణ కారణం గా ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేదుని ఇప్పటి వరకు ఆగినట్లు ఎమ్మెల్యే వంశీ చెప్పారు. అమరావతి ప్రాంతం నుంచి రాజధాని తరలించడం మూలంగా తన ప్రాంత రైతులు కొంత నష్టపోయారని అన్నారు. నా ఉప ఎన్నిక ఫలితాన్ని రాజధాని మార్పుపై ప్రజాభిప్రాయంగా చూసినా నాకు సమ్మతమేనని ఆయన తేల్చి చెప్పారు.

గన్నవరం ఉప ఎన్నికను రాజధాని మార్పుతో ముడి పెట్టాలా వద్దా అనేది టీడీపీ తేల్చుకోవాలని ఆయన సవాల్ విసిరారు. మూడు రాజధానుల పై అసెంబ్లీ రద్దు చెయ్యాల్సిన అవసరం ఏముందని వంశీ ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూలు ప్రకటిస్తామంటే ఇప్పుడే రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.

You might also like