FbTelugu

యమా లాగించేస్తున్నారట..

తెలంగాణవాసులు ఈ విషయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారట. ఇంతకీ ఏ విషయంలో ప్రథమ స్థానం వచ్చింది. కరోనా మరణాల్లోనా.. కరోనాను నియంత్రించడంలోనా.. లేక బాధితులను ఆదుకోవడంలోనా అన్న అనుమానాలు వస్తున్నాయి కదా.. మీకు ఈ అనుమానాలు రావడం సహజమే.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ అంతా కరోనా మీదేగదా. కానీ, తెలంగాణవాసులు దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది ఈ విషయంలో కాదు సుమా. మాంసం వినియోగంలో తెలంగాణ ప్రజలు జాతీయ సగటును దాటేశారట. అంటే అంతపెద్ద మొత్తంలో మాంసం తింటున్నారట. దేశంలో అన్నిరకాల మాంసాలు కలిపి జాతీయ సగటు వినియోగం 5.4 కిలోలు. అయితే, తెలంగాణలో మాత్రం అది 9.2 కిలోలుగా ఉంది.

అంటే తెలంగాణలో ఒక్కో వ్యక్తి 9.2 కిలోల మాంసం తింటున్నారట. ఇందులో యాట మాంసం (గొర్రెలు, మేకలు) వాటా 4 కిలోలని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సమాఖ్య తెలిపింది. కరోనా కాలంలోనూ మాంసం దుకాణాలు కిటకిటలాడడాన్ని చూస్తే ఇది నిజమేనని అనిపిస్తోంది కదా.!

You might also like